గ్లోబల్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన ప్రతి ఉద్యోగి కచ్చితంగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరింది. లేనిపక్షంలో ఉద్యోగుల వేతనాల్లో కోతలు, కొవిడ్ వ్యాక్సినేషన్ రూల్స్ పాటించకపోతే అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయించింది. ప్రతి ఉద్యోగి కొవిడ్ వ్యాక్సినేషన్ పాలసీని అనుసరించాలని హెచ్చరించింది. డిసెంబర్ 3లోగా వ్యాక్సినేషన్ స్టేటస్ తెలియజేయని ఉద్యోగులు మెడికల్ లేదా మతపరమైన మినహాయింపులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత వ్యాక్సినేషన్ పొందని ఉద్యోగులందరిని సంప్రదిస్తామని గూగుల్ పేర్కొంది. జనవరి 18లోగా గూగుల్ వ్యాక్సినేషన్ రూల్స్‌ను అనుసరించకపోతే 30 రోజలుఆపటు పేయిడ్ అడ్మినిస్ట్రేటివ్ లీవ్స్‌పై పంపిస్తామని పేర్కొంది.
ఆ తర్వాత 6 నెలలపాటు వేతనం లేని సెలవుపై పంపి.. ఉద్యోగం నుంచి పంపించివేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు గూగుల్ యాజమాన్యం ఉద్యోగులకు ఒక మెమోను జారీ చేసిందని అంతర్జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ రిపోర్టులపై గూగుల్ స్పందించలేదు. అయితే ఉద్యోగులు, కంపెనీని రక్షించుకోవడానికి ఈ విధానాన్ని రూపొందించినట్టు పరోక్షంగా పేర్కొంది. టీకాలు వేసుకోవడానికి ఉద్యోగులకు సహకారం అందించడం.. తమ టీకా విధానం బలంగా ఉండేందుకు సాధ్యమైన ప్రతిధాన్ని చేయడానికి కట్టుబడి ఉన్నామని గూగుల్‌కు చెందిన ఓ ప్రతినిధి పేర్కొన్నారు.