Friday, November 22, 2024

గూగుల్ కు భారీ జరిమానా..ఎంతో తెలుసా..

గూగుల్‌కు భారీ జ‌రిమానా ప‌డింది.బెల్జియం దేశంలోని బ్రసెల్స్ న‌గరంలో ఐటీ నిబంధనలు ఉల్లంఘించిన కార‌ణంగా గూగుల్‌కు రూ. 20,285 కోట్ల భారీ జరిమానాని యూరోపియన్‌ యూనియన్ (ఈయూ) కోర్టు విధించింది. గూగుల్‌ చట్టవిరుద్దంగా ఇతర కంపెనీలకు మెరిట్‌లపై పోటీపడే అవకాశంతోపాటు కొత్త‌ ఆవిష్కరణలను నిరాకరించిందని అభియోగాలు ఉన్నాయి. అలాగే ఈ చ‌ర్య‌ యూరోపియన్ యూనియ‌న్ వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు ఎంపిక చేసుకోవడంలో ప్రభావం చూపుతుందని ఈయూ కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆ దేశం లో ఉన్న ఒక కంపెనీ వివరాలు సర్చ్‌ ఇంజన్‌లో స‌రి అయినా ప్రాముఖ్యత ఇవ్వ లేద‌ని కూడా అభియోగాలు ఉన్నాయి. ఇది ఐటీ నిబంధనలకు వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని ఈయూ కోర్టు అభిప్రాయ ప‌డింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement