వారంలో మూడు రోజుల పాటు ఆఫీస్‌కు తప్పనిసరిగా రావాలని గూగుల్ తన ఉద్యోగులను ఆదేశించింది. ఈ మేరకు వారికి ఇ-మెయిల్ పంపించింది. ఇక నుంచి ఉద్యోగుల పనితీరును అంచనా వేయడంలో ఆఫీస్ హాజరు శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. వర్క్ ఫ్రమ్ హోం విధానంపై గూగుల్ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అస్పష్టమైన హాజరు విధానం ద్వారా తమ పనితీరును అంచనా వేయడం సరికాదని అల్పాబెట్ వర్కర్స్ యూనియన్‌లో కీలకంగా ఉన్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు సంతృప్తి వ్యక్తం చేశారు. మే నెలలో జరిగిన గూగుల్ వార్షిక సమావేశంలో ఆవిష్కరించిన ఉత్పత్తుల్లో చాలా వరకు ఒఒకే దగ్గర కూర్చుని సమన్వయంతో చేసుకున్న ఉద్యోగులో అభివృద్ధి చేసినట్లు తెలిపింది.
అందుకే ఆఫీస్‌లో సమన్వయంతో పని చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చని గూగుల్ ఉద్యోగులకు పంపించిన మెయిల్‌లో స్పష్టం చేసింది. ఆఫీస్‌కు రాని ఉద్యోగులకు వారి టీమ్ లీడర్లు రివైండర్లు పంపుతారని పేర్కొంది. ప్రత్యేక పరిస్థితులు ఉన్న సందర్భాల్లో మాత్రం ఆఫీస్‌కు రావడంపై మినహాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి వారానికి కనీసం మూడు రోజులు ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలని గూగుల్ కోరింది. ప్రస్తుతం ఈ ఆదేశాలను సంస్థలోని అన్ని విభాగాలకు విస్తరించింది.