మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ (పీటీఆర్)కి చెందిన ఓ పెద్దపులి శనివారం చనిపోయింది. ఇది 16 సంవత్సరాలకు పైగా ఇక్కడ ఉంటోంది. ఆ ఏరియాలో ‘కాలర్‌వాలి’గా ఇది ప్రసిద్ధిచెందినట్టు అటవీశాఖ చెబుతోంది. దీని మృతిపై మధ్య ప్రదేశ్ మంత్రి డాక్టర్ నరోత్తమ్ మిశ్రా ట్విట్టర్లో సంతాపం తెలిపారు.
‘సూపర్ మామ్‌కి చివరి వీడ్కోలు.. 29 పిల్లలకు జన్మనిచ్చిన పెంచ్ టైగర్ రిజర్వ్‌లోని కాలర్‌వాలి టైగర్ మరణ వార్త చాలా బాధేసింది.”అని ట్విట్టర్లో పేర్కొన్నారు.