Wednesday, November 20, 2024

కాశ్మీర్​ ఇష్యూ తేలితేనే భారత్​తో గుడ్​ రిలేషన్​.. పాక్​కాబోయే ప్రధాని షరీఫ్​ కామెంట్స్​

కశ్మీర్‌ సమస్య పరిష్కారమయ్యే వరకు భారత్‌లో సంబంధాలు సాధారణ స్థితికి రావని పాక్‌ ప్రధానమంత్రి అభ్యర్థి షాబాజ్‌ షరీఫ్‌ అన్నారు. శనివారం అర్ధరాత్రి పాక్‌ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన విషయం తెలిసింది. ఆ తర్వాత ఇమ్రాన్‌ ఖాన్‌ పదవీచ్యూతుడయ్యాడు. అవిశ్వాసం నెగ్గడంతో ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే షాబాజ్‌ షరీఫ్‌ను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయనను కొత్త ప్రభుత్వం భారత్‌తో సంబంధాలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తుందా? అని మీడియా ప్రశ్నించింది.

కశ్మీర్ సమస్య పరిష్కారం కానంత వరకు భారత్‌తో సంబంధాలు మామూలుగా ఉండవని చెప్పారు. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌పై కొనసాగుతున్న కేసులకు సంబంధించిన విషయంపై స్పందించారు. కేసులపై విచారణ చట్టపరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానంలో ఓటమిపాలైన ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ పార్టీ తమ ప్రధాని అభ్యర్థి పేరును ప్రకటించింది. ప్రధానమంత్రి అభ్యర్థిగా మాజీ విదేశాంగ మంత్రి షా మెహమూద్‌ షురేషీని ప్రకటించింది. ఉమ్మడి ప్రతిపక్షం షాబాజ్ షరీఫ్‌ను ప్రధాని పదవికి ఎంపిక చేయగా.. ఆయన ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేశారు. నిన్న అర్ధరాత్రి తర్వాత పాకిస్థాన్‌ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి.

అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరుగకుండా ఉండేందుకు పార్లమెంట్‌ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ రాజీనామా చేశారు. 12.40 గంటల ప్రాంతంలో ఓటింగ్‌ జరగ్గా.. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 174 మంది సభ్యులు ఓటు వేయడంతో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత జాతీయ అసెంబ్లీని సోమవారానికి వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement