కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసకుంటున్నట్టు ప్రధాని మోడీ చెప్పారు. రైతుల ఆందోళనతో ప్రధాని సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు శుక్రవారం తెలిపారు. ఈ శీతాకాలంలోనే జరిగే లోక్‌సభ సమావేశాల్లో వాటికి సంబంధించిన చట్టాలు వెనక్కి తీసుకుంటామన్నారు. గురునానక్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఈ విషయం తెలియజేశారు.
వ్యవసాయ చట్టాలపై తాము పునరాలోచన చేస్తున్నామని, గురునానక్ జయంతి సందర్భంగా ఈ మంచి నిర్ణయం తీసుకుంటున్నామని ప్రధాని మోడీ చెప్పారు. ఇక రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇంటికి వెళ్లండి. పొలాల్లో పనిచేసుకోండి అని కోరారు మోడీ.
మిమ్మల్ని ఇంతకాలం ఎంతో వేదనకు గురిచేశాను.. నన్ను క్షమించండి. ఇకమీదట ఏ ఆలోచన పెట్టుకోకుండా మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు ప్రధాని మోడీ