ముంబై : ఫిబ్రవరి 5వ తేదీన జియో నెట్‌వర్క్ స్తంభించిపోయింది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకున్న సంస్థ.. తమ కస్టమర్లకు ఓ మంచి అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించింది. ముంబై, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో రిలయన్స్ సేవలు నిలిచిపోయాయి. వినియోగదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కాల్స్ చేయలేకపోయారు. స్వీకరించలేకపోయారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం.
ఎక్కడ అయితే జియో వినియోగదారులు ప్రభావితం అయ్యారో.. ఆ ప్రాంతాల వారికి రెండు రోజుల ఉచిత కాలింగ్, డేటా సేవలు అందిస్తున్నట్టు జియో తెలిపింది. ప్రీ పెయిడ్ ప్లాన్ వాలిడిటీని రెండు రోజులు పొడగిస్తున్నట్టు తెలిపింది. జియో నెట్‌వర్క్ కారణంగా ప్రభావితమైన వారికి మాత్రమే అని పేర్కొంది. ఫిబ్రవరి 5న ముంబైలో ఇబ్బంది రాగా.. కొన్ని ప్రాంతాల్లో నాలుగైదు రోజుల నుంచి సరిగ్గా నెట్‌వర్క్ లేని పరిస్థితి. ఈ విషయాన్ని జియో కంపెనీ.. తమ వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో తెలియజేస్తున్నది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..