Friday, November 22, 2024

Breaking: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై ఆ అవసరం లేద‌న్న రైల్వే

రైళ్లలో రోజూ పెద్ద సంఖ్యలో జనం జ‌ర్నీ చేస్తుంటారు. కొన్ని రైళ్ల‌లో అయితే సౌకర్యవంతంగా ఉండడంతో పాటు ఫుడ్ కూడా అందుబాటులో ఉంటుంది. సాధారణ బెర్తుల‌తో పాటు ఏసీ ఫెసిలిటీ ఉన్న ట్రెయిన్స్ కూడా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా త‌క్కువ చార్జీలోనే ప్రయాణం, భద్రతతో ఉండడంతో జనం దూర ప్ర‌యాణాల‌కు రైలు జ‌ర్నీపైనే ఇంట్ర‌స్ట్ చూపిస్తారు. అలాగే టికెట్లను సైతం సులభంగా బుక్‌ చేసేందుకు అవకాశం ఉన్నది. కాగా, ఈ విష‌యంలో ప్రస్తుతం రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇటీవల టికెట్లను బుక్‌ చేసేందుకు తప్పనిసరిగా ప్రయాణికుడు తన చిరునామాను ఇవ్వడం కంప‌ల్స‌రీ చేసింది.

రైలు జ‌ర్నీ చేయాల‌నుకునే వారు పూర్తి అడ్రెస్ ఇవ్వ‌క‌పోతే టికెట్లు బుక్‌ అయ్యే చాన్స్‌ లేదు. దీంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తాజాగా ఈ కండిష‌న్స్‌ని రైల్వేశాఖ ఎత్తివేసింది. ఇకపై చిరునామా ఇవ్వకుండానే టికెట్లు బుక్‌ చేసుకునే అవకాశం క‌ల్పిస్తున్న‌ట్టు భార‌త రైల్వే వ‌ర్గాలు పేర్కొన్నాయి. కరోనా సమయంలో అందుబాటులోకి తెచ్చిన ఈ నిబంధ‌న‌ల‌ను రైల్వేశాఖ ఇప్పుడు తొల‌గించిన‌ట్టు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement