Thursday, November 21, 2024

వాహనదారులకు గుడ్​న్యూస్​.. మే26 నుంచి భారత్‌లో కియా ఈవీ6 బుకింగ్స్‌

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా భారతీయ వాహనదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. త్వరలోనే ఇండియాలో తమ కంపెనీ నుంచి ఫస్ట్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ లాంచ్‌ చేస్తున్నట్లు తాజాగా అనౌన్స్‌ చేసింది. ఈ ఏడాదిలోనే ఈవీ6 అనే హైఎండ్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ వెహికల్‌ను ఇండియాలో లాంచ్‌ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. దీనితో ఇండియన్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ విభాగంలోకి కియా కూడా చేరుకోవడం ఖాయమైంది. ఈవీ6 వెహికల్‌ ప్రపంచవ్యాప్తంగా గతేడాది మార్చిలోనే రిలీజ్‌ అయింది. భారత్‌లో కియా ఈవీ6 బుకింగ్స్‌ మే 26 నుంచి ప్రారంభమవుతాయని దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ పేర్కొంది. ఇండియన్‌ మార్కెట్‌ కోసం కేవలం 100 యూనిట్ల ఈవీ6ని మాత్రమే కియా కేటాయిస్తుంది. వీటిలో ప్రతి ఒక్కటి కంప్లీట్లీ బిల్ట్‌ఇన్‌ యూనిట్‌గా ఇక్కడకు చేరుకుంటుంది. వీటికి దిగుమతి సుంకం చెల్లించాలి కాబట్టి ఈవీ6 భారీ ప్రైస్‌ ట్యాగ్‌తో ఇండియాకి రావచ్చని తెలుస్తోంది. ఈవీ6 అనేది ఒక ఆల్‌ఎలక్ట్రిక్‌ క్రాస్‌ఓవర్‌. ఈవీ6 అనేది కియా నుంచి లాంచ్‌ అయిన ఫస్ట్‌ బీఈవీ కావడం విశేషం. ఈ కారు సింగిల్‌ ఛార్జీకి 499 కిమీల డ్రైవింగ్‌ రేంజ్‌ని అందజేస్తుంది. ఈవీ6లో లెడ్‌ హెడ్‌ల్యాంప్‌లతో కూడిన అందమైన ఫ్రంట్‌ గ్రిల్‌, క్లీన్‌ డిజైన్‌తో ఫ్రంట్‌ బంపర్‌, ఏటవాలుగా ఉన్న రూఫ్‌లైన్‌, ర్యాక్డ్‌ విండ్‌స్క్రీన్‌, రూఫ్‌ స్పాయిలర్‌, డక్‌టేయిల్‌ స్పాయిలర్‌, గ్లోసీ బ్లాక్‌ సైడ్‌ క్లాడింగ్‌, లార్జ్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ హెడ్‌అప్‌ డిస్‌ప్లే, ఎల్‌ఈడీ లైటింగ్‌, ఆన్‌బోర్డ్‌ పవర్‌ జనరేటర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement