Friday, November 22, 2024

గతంలో ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను వాయిదా వేసిన బైడెన్

అమెరికాలో H1B వీసాతో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులకు ఊరట లభించింది. ట్రంప్ గతంలో తీసుకున్న కనీస వార్షిక వేతన నిబంధన అమలును తాజాగా 60 రోజుల పాటు బైడెన్ సర్కారు వాయిదా వేసింది. ఫిబ్రవరి 1న అమెరికా కార్మికశాఖ ఈ ప్రతిపాదన చేసింది. గతంలో ట్రంప్ తీసుకొచ్చిన రూల్ ప్రకారం 1,10,000 డాలర్ల కన్నా తక్కువ వార్షిక వేతనం ఉన్నవారు స్వదేశానికి తిరిగిరావాల్సి ఉండేది. అంతేకాకుండా కొత్తగా వెళ్లేవారికి ఆ రూల్ వర్తించడం వల్ల భారత టెకీలకు ఇబ్బందులు ఏర్పడేవి.

కాగా H1Bవీసాలకు సంబంధించి ట్రంప్‌ సర్కారు తీసుకున్న కొన్ని నిర్ణయాలను బైడెన్‌ సర్కారు వెనక్కితీసుకోవడాన్ని ‘ఫెడరేషన్‌ ఫర్‌ అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ రిఫార్మ్‌ (ఫెయిర్‌) వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా.. H1B వీసాల విషయంలో లాటరీ పద్ధతికి మళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాల వల్ల.. విదేశీయుల్లో అత్యుత్తమ ప్రతిభ గలిగినవారు మాత్రమే అమెరికాలో ఉంటారని ఫెయిర్‌ పేర్కొంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement