Tuesday, November 26, 2024

ప‌సిడి ప్రియుల‌కు గుడ్ న్యూస్ – త‌గ్గిన బంగారం ధ‌ర‌లు

నేటి బంగారం ధ‌ర‌లు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. దాంతో బంగారం కొనాలని భావించే వారికి మంచి ఛాన్స్. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో ఇప్పటికే కొండెక్కిన పసిడి రేట్లు నేడు పడిపోయాయి. బంగారం ధరలు దిగిరావడం ఏప్రిల్ 4 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఏప్రిల్ 21న తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.760 క్షీణించింది. దీంతో ఈ గోల్డ్ రేటు రూ.53,620కు పడిపోయింది. అలాగే ఆర్నమెంటల్ 22 క్యారెట్ల బంగారం ధర రూ.700 తగ్గుదలతో రూ.49,150కు దిగివచ్చింది. గోల్డ్ రేట్లతోపాటుగా వెండి ధర కూడా నేలచూపులు చూసింది. ఏకంగా రూ.1600 కుప్పకూలింది. దీంతో సిల్వర్ రేటు కేజీకి రూ.73,300కు క్షీణించింది. వెండి రేటు నిన్న కూడా రూ.300 తగ్గింది. అంటే వరుసగా రెండు రోజులుగా సిల్వర్ రేటు పడిపోతూనే వస్తోంది. పసిడి, వెండి ప్రేమికులకు ఇది గుడ్ న్యూస్.

Advertisement

తాజా వార్తలు

Advertisement