Thursday, November 21, 2024

రైతుల ఇళ్లకు వెళ్లి పథకం పాలసీ అంద‌జేస్తాం – కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద, ఈ పథకం యొక్క పత్రాల‌ని మొదటిసారిగా రైతులకు అందజేయ‌నున్నారు. ఇండోర్ నగరంలోని బుర్హి బర్లాయ్ గ్రామంలో జరిగే ‘మేరీ పలిసి మేరే హాత్’ కార్యక్రమంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా ఈ పాలసీని రైతులకు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కొంతమంది రైతులకు పంటల బీమా పాలసీ పంపిణీ చేయనున్నారు. ఎంపిక చేసిన రైతు ఉత్పత్తిదారుల సంస్థ (FPO)కి కూడా సర్టిఫికెట్లు పంపిణీ చేయబడతాయి. వేదిక వద్ద వ్యవసాయ శాఖ, ఇతర సంస్థలచే కృషి మేళా , ప్రదర్శన కూడా నిర్వహించబడుతుంది. ఈ జాతరలో రైతులకు.. డ్రోన్‌ల వినియోగంపై కూడా అవగాహన కల్పిస్తారు.

దీంతో పాటు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ..కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తో జ్యోతి వెలిగించారు. ఆ తర్వాత కన్యాపూజ చేసి వేడుకను కూడా ప్రారంభించారు. వేదికపైకి వచ్చిన ఆయనకు జలవనరుల శాఖ మంత్రి తులసీ సిలావత్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కమల్ పటేల్ కూడా పాల్గొన్నారు.పిఎం ఫసల్ బీమా యోజన సిఇఒ రితేష్ చౌహాన్ తన స్వాగత ప్రసంగంలో ఫసల్ బీమా యోజన గురించి సమాచారం ఇస్తూ, ఈ పథకం కోట్లాది మంది రైతులకు ఉపశమనం కలిగించిందని అన్నారు. ఆరేళ్ల క్రితం మధ్యప్రదేశ్ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పుడు రైతుల ఇళ్లకు వెళ్లి పథకం పాలసీని అందజేస్తారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement