Monday, November 11, 2024

ఆస్తమా రోగులకు శుభవార్త.. జూన్ 10న చేపమందు

అస్తమా బాధితులకు చేప మందు పంపిణీ చేయనున్నారు..చేపమందుని పంపిణి చేయడంలో ప్రసిద్ధి చెందారు హైదరాబాద్ వాసులు బత్తిన సోదరులు. ప్రతి సారి ఎన్ని వివాదాలొచ్చినా, చేప మందులో శాస్త్రీయత లేదని కోర్టులకు వెళ్ళినా సరే చేప మందు ప్రతి ఏటా పంపిణీ చేస్తూనే వచ్చారు. అయితే కరోనా కారణంగా 2020 నుంచి చేప మందు పంపిణీ నిలిపివేశారు. కాగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన చేప మందును బత్తిని సోదరులు త్వరలో పంపిణీ చేయనున్నారు. జూన్ 10వ తేదీ ఉదయం 8 గంటలకు (మృగశిర కార్తె ప్రవేశించగానే) చేపమందు పంపిణీ ప్రారంభం కానుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రోజు 24 గంటల పాటు చేపమందు పంపిణీ చేయనున్నారు. కొవిడ్ కారణంగా గత మూడేళ్లు (2020, 2021, 2022)గా చేపమందు పంపిణీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా చేప మందు కోసం దేశ నలుమూలల నుంచి ఆస్తమా రోగులు హైదరాబాద్‌‌కు‌‌‌ వస్తారు. బత్తిన సోదరులు అందించే చేప మందు కోసం జనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతారు. వివిధ రాష్ట్రాల నుండి హైదరాబాద్‌కు వచ్చి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బస చేసి.. చేప మందు కోసం ఎదురు చూస్తారన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement