Saturday, November 23, 2024

Good News: త్వ‌ర‌లోనే కొవిడ్ ట్యాబ్లెట్స్.. త‌యారీకి ప‌ర్మిష‌న్‌ ఇచ్చిన ఫైజ‌ర్‌

త్వ‌ర‌లోనే క‌రోనా నివార‌ణ‌కు ట్యాబ్లెట్స్ రానున్నాయి. వైరస్‌ను క‌ట్ట‌డి చేసేందుకు అమెరికాకు చెందిన‌ ఫైజర్ సంస్థ డెవ‌ల‌ప్ చేసిన కొవిడ్ యాంటీ వైరల్ మెడిసిన్స్ విషయంలో ఓ ఇంపార్టెంట్‌ అప్‌డేట్ వ‌చ్చింది. ఇతర కంపెనీలకు పేటెంట్ విషయంలో ఫైజర్ సంస్థ‌ కీలక నిర్ణయం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు ప్రస్తుతం ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్ మాత్ర‌మే.

కొత్తగా ప్రముఖ అమెరికన్ కంపెనీ ఫైజర్ సంస్థ‌ యాంటీ వైరల్ మెడిసిన్‌ని డెవ‌ల‌ప్ చేసింది. ఈ కొత్త యాంటీ వైరల్ ట్యాబ్లెట్లను ఫైజ‌ర్‌ అభివృద్ధి చేసినా.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీనిపై కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసిన యాంటీ వైరల్ ట్యాబ్లెట్స్‌పై రాయల్టీ వదులుకునేందుకు కూడా ఫైజ‌ర్ రెడీ అయ్యింది.

ఐక్యరాజ్యసమితి మద్దతు కలిగిన జెనీవాకు చెందిన మెడిసిన్స్ పేటెంట్ పూల్ బృందంతో ఈ మేర‌కు ఒప్పందం చేసుకుంది. యాంటీ వైరల్ ట్యాబ్లెట్స్ తయారు చేసేందుకు ఆ బృందానికి ఫైజర్ కంపెనీ లైసెన్స్ మంజూరు చేసింది. ఎంపీపీ సంస్థ తక్కువ ధరకే నిరుపేద దేశాలకు మెడిస‌న్ స‌ప్ల‌య్ చేస్తోంది.

ఫైజర్ చేసుకున్న ఒప్పందం ద్వారా ప్రపంచ జనాభాలో 53శాతం మందికి కొవిడ్ ట్యాబ్లెట్స్‌ అందుబాటులోకి రానున్నాయి. దీంతో 95 దేశాల్లో ఈ మాత్రల్ని అత్యంత తక్కువ‌ ధరకే పంపిణీ చేయవచ్చు. మరి కొద్దిరోజుల్లోనే ఇవి మార్కెట్‌లో రానున్న‌ట్టు స‌మాచారం.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement