ప్రభన్యూస్ : ఈ మధ్య కాలంలో గ్యాస్ ధర రూ.900లకు చేరుకుంది. పెరుగుతున్న నిత్యవసర సరుకులతోపాటు గ్యాస్ సిలిండర్ రూ.900 కొనుగోలు చేయడం సామాన్యులకు భారంగా మారింది. అయితే.. కొంతకాలంగా ప్రభుత్వం ఇస్తున్న గ్యాస్ సబ్సిడీ కూడా రాకపోవడంతో ఇది మరింత భారంగా మారింది. కేంద్రం అందిస్తున్న సబ్సిడీ కొంతకాలంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. గ్యాస్ సబ్సిడీని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు కూడా అందాయి. ఇది ప్రస్తుతం పరిశీలనలో ఉందని సమాచారం. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో డొమెస్టిక్ గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారు.
వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీని దేశం మొత్తం అందించేందుకు ప్రణాళిక చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ డీలర్‌లకు రూ.303 సబ్సిడీ ఇస్తారు. దీంతో గృహ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.303 తగ్గింపు ఇచ్చే అవకాశముంది. దీంతో గృహ సిలిండర్‌పై రూ.303 సబ్సిడీతో.. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ రూ. 587కి అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.900 ఉంది. ఇలాంటి పరిస్థితిలో సబ్సిడీని పొందడానికి గ్యాస్ కనెక్షన్‌తో ఆధార్ నంబర్‌ను లింక్ చేయడానికి డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital