Friday, September 27, 2024

ఓటీటీలో గుడ్ ల‌క్ స‌ఖి..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ అవార్డ్ గ్రహీత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్టే మూవీ గుడ్ లక్ సఖి. ఈ సినిమాలో టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి .. జగపతి బాబు కూడా కీలకపాత్ర సోశించారు. ఓ గ్రామీణ యువతి జాతీయ స్థాయి షూటర్‏గా ఎలా మారిందనే కథాంశంతో.. స్పోర్ట్స్ బ్యాక్‏డ్రాప్‏లో తెరకెక్కిన ఈ సినిమా గత నెల 28న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నగేష్ కుకునూర్ తెరకెక్కించిన ఈ సినిమాది. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

తాజాగా ఈ సినిమా ఓటీటీలో సంద‌డి చేసేందుకు సిద్ధమైంది. గుడ్ లక్ సఖి సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‏లో ఫిబ్రవరి 12న స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు మేకర్స్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement