రాష్ట్రంలోని యువతకు మంచిరోజులు వచ్చాయని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. 91వేల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినందుకు పెద్దపల్లి నియోజకవర్గ యువత పక్షాన సీఎం కేసీఆర్ కు పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాబోయేది ఉద్యోగ నామ సంవత్సర మని, నోటిఫికేషన్లు జారీ కాగానే యువత దరఖాస్తులు చేసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 95 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే లభించడం హర్షణీయమన్నారు. పెద్దపెల్లి నియోజకవర్గంలోని యువత పెద్ద ఎత్తున ఉద్యోగాలు పొందేలా కృషి చేస్తామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement