Friday, November 22, 2024

ప్ర‌ధాని మోడీ మ‌న్ కీ బాత్ లో గోల్కొండ‌….

న్యూఢిల్లి, ఆంధ్రప్రభ: మన్‌ కీ బాత్‌ 100వ ఎపిసోడ్‌ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మూడు విశిష్ట కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఆర్ట్‌ ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ షో నిర్వ హంచే 13 చారిత్రక కట్టడాల్లో గోల్కొండ కోట స్థానం దక్కించుకుంది. న్యూఢిల్లిలోని ”ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ద ఆర్ట్స్‌”లో సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ విలేకరుల సమావేశం నిర్వహంచి తమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహంచనున్న మూడు విశిష్ట కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. 13 ఐకానిక్‌ ప్రదేశాలలో ఆర్ట్‌ ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌, సౌండ్‌ లైటింగ్‌ షోలు, ఎన్జిఎంఏలో జనశక్తి ఆర్ట్‌ ఎగ్జి బిషన్‌, మన్‌ కీ బాత్‌ ఇతివృత్తాలపై అమర్‌ చిత్ర కథా కామిక్స్‌ విడుదల కార్య క్రమాలు చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. అక్టోబర్‌ 3, 2014లో ప్రారంభమైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంతరంగాన్ని ఆవిష్కరించే మన్‌ కీ బాత్‌ 100వ ఎపిసోడ్‌ ఈనెల 30న ఆల్‌ ఇండియా రేడియోలో ప్రసారం కానుంది.

మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ప్రధాని ప్రజలతో నేరుగా సంభాషించే, అసాధారణ వ్యక్తుల విజయాలను వెలికితీయడంలో, ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలవడంలో ఓ వేదికగా నిలిచిందని గోవింద్‌ మోహన్‌ అభిప్రాయపడ్డారు. ఈనెల 29న పురావ స్తు శాఖ స్మారక చిహ్నాలతో సహా చారిత్రక ప్రాంతాలైన న్యూఢిల్లిలోని ఎర్రకోట, ప్రధానమంత్రి సంగ్రహాలయ, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ కోట, ఒడిశాలోని కోణార్క్‌ సూర్య దేవాలయం, తెలంగాణలోని గోల్కొండ కోట, తమిళనాడు లోని వెల్లూరు కోట, మహారాష్ట్రలోని గేట్‌ వే ఆఫ్‌ ఇండియా, జార్ఖండ్‌లోని నవరతన్‌గఢ్‌ ఫోర్ట్‌, ఉధంపూర్‌లోని రామ్‌నగర్‌ ప్యాలెస్‌, ఉత్తరప్రదేశ్‌లోని రెసిడెన్సీ బిల్డింగ్‌, గుజరాత్‌లోని మోధెరా సూర్య దేవాలయం, అసోంలోని రంగ్‌ గఢ్‌, రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్‌ కోటలో అత్యాధునిక ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ షోల ద్వారా ఈ వేడుకను ఘనంగా నిర్వహస్తున్నట్టు గోవింద్‌ మోహన్‌ చెప్పారు. సాయంత్రం 5 గంటల నుంచి చారిత్రక కట్టడాలలో ప్రాంతీయ భాష లో భారతదేశ చరిత్ర, వారసత్వ కట్టడాల విశిష్టతలను వివరించే ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ షో అందరినీ ఆకట్టుకుంటుందని ఆయన అభిలషించారు. మనదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన విజయాలు, ఈశాన్య భారత సంస్కృతి సంప్రదా యాలు, వివిధ కళల ప్రదర్శన ఉంటుందని ఆయన వెల్లడించారు. మూడో అంశంలో భాగంగా మన్‌కీ బాత్‌లో మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధానమంత్రి ద్వారా వెలుగులోకి వచ్చిన సామాన్యుల వీరోచిత గాథలు, ఇతివృత్తాలతో అమర్‌ చిత్ర కథ పేరుతో 12 పుస్తకాల సిరీస్‌ను ఈనెల 30న విడుదల చేస్తున్నట్టు గోవింద్‌ మోహన్‌ తెలిపారు. ఇంగ్లిష్‌లో ప్రింటైన ఈ పుస్తకాలను 12 భారతీయ భాషల్లోకి అనువదించనున్నారు. ఇవన్నీ ప్రజలతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని గోవింద్‌ మో#హన్‌ ఆకాంక్షించారు. మన్‌కీ బాత్‌లో ఈ ఆదివారం జాతినుద్దేశించి ప్రధానమంత్రి చేసే ప్రసంగం 22 భారతీయ భాషలు, 29 మాండలికాలు, 11 అంతర్జాతీయ భాషలలో బ#హుళ వేదికల ద్వారా ప్రసారం కానుందని ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement