Friday, November 22, 2024

టోక్యో ఒలింపిక్స్‌: గోల్ఫ్ ఫైనల్లో చేజారిన పతకం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత గోల్ఫర్ అదితి పతకం కోల్పోయింది. ఒలింపిక్స్‌లో 4వ స్థానంతో సరిపెట్టుకుంది. గోల్ఫ్ వ్యక్తిగత స్ట్రోక్‌ప్లేలో 4వ స్థానంలో అదితి నిలిచింది. అయితే భారత ఖాతాలో పతకం పడకపోయినా.. ఫైనల్‌లో గట్టి పోటీ ఇచ్చి అతిధి అశోక్‌ ఆకట్టుకుంది. నెల్లీ కోర్డా స్వర్ణం కన్ఫర్మ్‌ చేసుకోగా, జపాన్‌ ఇనామీ, లడియాలు రెండో ప్లేసులో సంయుక్తంగా నిలిచి.. రజత, కాంస్య బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. చివర్లో పతకంకు అవకాశాలకు కేవలం రెండు హోల్స్‌ ఉన్న సమయంలో.. వర్షంతో మ్యాచ్‌ నిలిపి వేయడంతో ఉత్కంఠ నెలకొంది. కాసేపటికి తిరిగి ఆట మొదలైంది. వర్షం తర్వాత మొదటి ప్లేస్‌లో నెల్లీ కోర్డా, ఇనామీ లు లీడ్‌లో నిలవడం విశేషం. తర్వాతి ప్లేస్‌లో లిడియా(ఎల్‌) కో నిలిచింది.  వర్షం తెరిపి ఇచ్చాక మొదలైన నాలుగో రౌండ్‌ మ్యాచ్‌లో తర్వాతి హోల్‌లో నాలుగో పొజిషన్‌కి పడిపోయింది అతిది. ఆపై ఒక్క షాట్‌ తేడాతో కాంస్యం తృటిలో చేజార్చుకుంది

కాగా, గ‌త మూడు రోజులుగా నిలకడగా రాణించినా అదితికి.. ఇనామీ, లియాడో కో నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయినా అదితి చరిత్ర సృష్టించింది. ఓ భారత గోల్ఫర్ ఇలా ఒలింపిక్స్ లో నాలుగో స్థానంలో నిలవడం ఇదే తొలిసారి. మహిళల గోల్ఫ్‌ వ్యక్తిగత స్ట్రోక్‌ ప్లే ఈవెంట్‌లో భారత గోల్ఫర్‌ అదితి అశోక్‌ పతకం రేసులో ఉంది. శుక్రవారం మూడో రౌండ్‌ పూర్తయ్యే సమయానికి అదితి టోటల్‌ పార్‌ స్కోరులో 201తో రెండో స్థానంలో ఉంది. అదితి అశోక్ 18 ఏళ్ల వయసులోనే 2016 రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. తద్వారా ఒలింపిక్స్ బరిలో దిగిన అతి పిన్న గోల్ఫర్‌గా రికార్డుకెక్కింది.

ఇది కూడా చదవండిః త్వరలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ.. దళిత వర్గానికి డిప్యూటీ సీఎం పదవి!

Advertisement

తాజా వార్తలు

Advertisement