Tuesday, November 26, 2024

నేటి బంగారం ధ‌ర‌లు ఇవే

నేడు బంగారం ధ‌ర‌లు కాస్త పెరిగాయి. హైద‌రాబాద్, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నంలో బంగారం ధ‌రలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పైకి కదిలింది. దీంతో పసిడి రేటు రూ. 49,690కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.150 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ. 45,550 ఎగసింది. బంగారం ధరలు పైకి కదిలితే వెండి కూడా పైకి చేరింది. రూ. 1700 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 66,800కు ఎగసింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది.

ఔన్స్‌కు 0.07 శాతం దిగివచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1826 డాలర్లకు క్షీణించింది. వెండి మాత్రం పైపైకి చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.04 శాతం పెరుగుదలతో 23.21 డాలర్లకు ఎగసింది. కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement