సూడాన్ నుండి వస్తున్న 23మంది ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.ఈ తనిఖీల్లో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.ఈ బంగారం విలువ దాదాపు రూ. 8 కోట్లు ఉంటుందని లెక్కగట్టారు. ఈ క్రమంలో షూకింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరల్లో దాదాపు 15 కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ. 7.90 కోట్లు ఉంటుందని తేల్చారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు, మిగతా వారిని విచారిస్తున్నారు.ఈ బంగారం శంషాబాద్ విమనాశ్రయంలో పట్టుబడింది. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడడం ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement