బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబర్ 6న హైదరాబాద్‌లో పసిడి ధర రూ. 400 మేర పెరిగింది. దీంతో క్రితం రోజు రూ.47,350 వద్ద ఉన్న 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు రూ. 47, 750కి పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే అది కూడా తులానికి రూ.440 మేర ఎగసింది. దీంతో 3 రోజుల్లో దాదాపు 1500 రూపాయల మేర పసిడి ధర పెరిగింది. సిల్వర్ ధరలు కూడా స్వల్పంగా కేజీకి రూ. 300 పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 66,700 వద్ద ఉంది.సాధారణంగా భారత్‌కు ప్రధాన గోల్డ్ సరఫరాదారులుగా ఉన్న ICBC స్టాండర్డ్ బ్యాంక్, జేపీ మోర్గాన్, స్టాండర్డ్ ఛార్టర్డ్.. పండగల సమయంలో భారత్‌కు ఎక్కువ గోల్డ్ సప్లై చేయాల్సి ఉంది. కానీ ఈసారి దానికి భిన్నంగా గతేడాది కంటే 10 శాతం తక్కువగానే బంగారం ఎగుమతి చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సెప్టెంబర్‌లో భారత్‌లో బంగారం దిగుమతులు ఏకంగా 30 శాతం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో టర్కీలో బంగారం దిగుమతులు 543 శాతం మేర పెరగడం చూస్తే అర్థమవుతుంది. హాంకాంగ్ మీదుగా చైనాకు కూడా ఇదే రీతిలో బంగారం తరలివెళ్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement