Tuesday, November 19, 2024

పెరిగిన బంగారం ధ‌ర‌లు.. ప‌సిడి బాట‌లోనే వెండి

గ‌త కొన్ని రోజులుగా బంగారం..వెండి ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు క‌నిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ. 250 మేర పెరిగి.. రూ. 49,750కి చేరింది. ఇది 3 రోజుల వ్యవధిలో రూ.450 పెరిగింది. బంగారం, వెండి కలిపి గడిచిన 3 రోజుల్లో రూ.2 వేలకుపైనే పెరిగాయి. విజయవాడలో కూడా బంగారం ధర ఇలాగే ఉంది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర కూడా హైదరాబాద్‌లో పెరిగింది. ఒక్కరోజులోనే రూ.280 మేర పెరిగి ప్రస్తుతం రూ.54,280 వద్ద కొనసాగుతోంది.

ఇక ఢిల్లీలో బంగారం ధర కాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ 2 క్యారెట్ల తులం గోల్డ్ రూ.49,900 పలుకుతోంది. ఇక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.54,440 వద్ద ఉంది. అక్కడి పరిస్థితులు, పన్నులకు అనుగుణంగా రేట్లలో కాస్త మార్పులుంటాయి. వెండి విషయానికి వస్తే ఇది మరింత రికార్డు విలువల్లో కొనసాగుతోంది. హైదరాబాద్‌లో వరుసగా 3 రోజుల్లో రూ.1700 మేర సిల్వర్ రేటు పెరిగింది. తాజాగా రూ.1200 మేర పెరిగి కిలో వెండి ధర రూ.72,500కు ఎగబాకింది. ఢిల్లీలో ఒక్కరోజే కిలోకు రూ. 1400 మేర పెరిగి ప్రస్తుతం రూ.67,600 వద్ద ఉంది. హైదరాబాద్ సహా ఇతర మార్కెట్లతో పోలిస్తే ఢిల్లీలో వెండి రేటు చాలా తక్కువగా ఉంటుంది. ఇది సుమారు 5 వేల రూపాయల వరకు తక్కువగా లభిస్తుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement