నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు 10 గ్రాములకు ఒక్కరోజే రూ.800 మేర పతనమై రూ.54,200 మార్కుకు చేరింది. ఇటీవల ఒక దశలో ఇది రూ.55,300 వద్ద జీవనకాల గరిష్టాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు హైదరాబాద్‌లో తాజాగా రూ.870 పడిపోయి రూ.59,130 వద్ద కొనసాగుతోంది. ఇది 3 రోజుల కిందట రూ.60,320 వద్ద ఆల్ టైం హై ని తాకింది.ఇదే సమయంలో దేశ రాజధాని దిల్లీలో గోల్డ్ రేటు భారీగా తగ్గింది. అక్కడ 10 గ్రాములకు ఒక్కరోజు రూ.800 పతనమై రూ.54,350కి చేరింది. ఇక 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకు దేశ రాజధానిలో రూ.870 పతనమై.. రూ.59,280 మార్కుకు చేరింది.బంగారం ధరలు పడిపోయిన తరుణంలో.. అదే బాటలో వెండి కూడా పయనించింది. ఈ ధరలు కూడా తగ్గాయి. దిల్లీలో కిలో వెండి ధర తాజాగా రూ.500 పడిపోయి రూ.71,600 మార్కును తాకింది. హైదరాబాద్‌లో మాత్రం కేజీపై రూ.700 తగ్గి ప్రస్తుతం విలువ రూ.74 వేల వద్ద స్థిరంగా ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement