Sunday, November 24, 2024

నేడు బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 21న 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.100 తగ్గి.. రూ.52,100 వద్ద కొనసాగుతోంది. మరోవైపు ఇదే 24 క్యారెట్లకు రూ.120 పతనమై రూ.56,830 కు చేరింది. దిల్లీలో కూడా గోల్డ్ రేటు పడిపోయింది. 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.100 పడిపోగా.. అక్కడ ప్రస్తుతం రూ.52,250 మార్కు వద్ద ఉంది. మరోవైపు 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.100 పడిపోియ దిల్లీలో 10 గ్రాములు రూ.57 వేలు పలుకుతోంది. గోల్డ్‌తో పాటు సిల్వర్ రేట్లు కూడా పడిపోయాయి. దిల్లీలో కిలో వెండి రేటు రూ.100 పడిపోగా.. ప్రస్తుతం రూ.68,500 వద్ద ఉంది. ఇక్కడ గత 10 రోజుల్లో ఒక్కరోజు మాత్రమే సిల్వర్ రేటు పెరగడం గమనార్హం.

ఇక హైదరాబాద్‌లో కూడా వెండి పతనమైంది. తాజాగా రూ.100 తగ్గి రూ.71700 మార్కు వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌తో చూస్తే దేశ రాజధాని దిల్లీలో వెండి చౌకగా లభిస్తుంది. అదే బంగారం ధర మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుంది. స్థానికంగా ఉండే పన్నులను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయని గుర్తుంచుకోవాలి. బంగారం కొనుగోలు చేసేందుకు ఇది మంచి సమయమనే చెబుతున్నారు నిపుణులు. కొద్దిరోజుల కిందట ఆల్ టైం హైకి చేరిన సంగతి తెలిసిందే. ఇక 10 రోజులుగా భారీగా పడిపోతున్నాయి. రానున్న రోజుల్లోనూ బంగారం, వెండి ధరలు సరికొత్త గరిష్టాలకు చేరుతాయని అంచనాలున్నాయి. అందుకే ప్రస్తుతం రేట్ల దగ్గర కొనుగోలు చేయొచ్చని, ముఖ్యంగా పసిడి ఇన్వెస్టర్లకు ఇది మంచి సమయమని సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement