నేటి బంగారం.. వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. దేశీయంగా బంగారం, వెండి ధరలు పడిపోయాయి. హైదరాబాద్, దిల్లీల్లో రేట్లు ఇప్పుడు ఎలా ట్రేడవుతున్నాయో చూద్దాం. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాములకు ప్రస్తుతం ఒక్కరోజే రూ.150 మేర తగ్గింది. దీంతో ఇప్పుడు రూ.55,700 మార్కు వద్ద కదలాడుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే మాత్రం 10 గ్రాముల రేటు రూ.170 పతనమై.. రూ.60,760 వద్ద ఉంది. ఇదే సమయంలో దిల్లీ మార్కెట్లో కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు పడిపోయాయి. దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం రేటు 22 క్యారెట్లకు రూ.150 మేర పతనం కాగా.. రూ.55,850 వద్ద కొనసాగుతోంది.
ఇదే 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే 10 గ్రాములకు రూ.170 మేర పడిపోగా.. ప్రస్తుతం రూ.60,910 మార్కు వద్ద కొనసాగుతోంది. వెండి రేట్ల విషయానికి వస్తే హైదరాబాద్ మార్కెట్లో ఒక్కరోజే రూ.200 మేర పడిపోయింది. దీంతో ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు రూ.80,200 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని దిల్లీలో మాత్రం వెండి ధరలు వరుసగా పడిపోతూనే ఉన్నాయి. అక్కడ తాజాగా రూ.200 తగ్గగా.. రూ. 76 వేల మార్కు వద్ద ఉంది. సాధారణంగా బంగారం, వెండి ధరలు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. స్థానికంగా ఉండే పన్ను రేట్లను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ఈ ప్రాతిపదికనే హైదరాబాద్‌తో చూస్తే బంగారం ధరలు దిల్లీలో కాస్త ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా వెండి రేట్లను ఓసారి పరిశీలిస్తే హైదరాబాద్‌లో ఎక్కువగా ఉంటాయి.