నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి.. హైదారాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన బంగారం ధర 10 గ్రాములకు రూ.210 మేర తగ్గింది. ప్రస్తుతం తులం బంగారం రూ.54 వేల 500 మార్క్ వద్ద అమ్ముడవుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు తులానికి రూ.240 మేర దిగివచ్చి ప్రస్తుతం రూ.59 వేల 450 వద్ద ట్రేడవుతోంది. మొత్తంగా గడిచిన మూడు సెషన్లలో బంగారం ధర రూ.500 మేర దిగివచ్చింది. ఇక దేశ రాజధాని దిల్లీలో చూసుకున్నట్లయితే బంగారం 22 క్యారెట్లకు రూ.250 మేర తగ్గి రూ.54 వేల 650 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములకు రూ.280 మేర పడిపోయింది. ప్రస్తుతం రూ.59 వేల 600 మార్క్ వద్ద కొనసాగుతోంది. వెండి సైతం ఎట్టకేలకు ఇవాళ దిగివచ్చింది. వరుసగా స్థిరంగా కొనసాగిన పుత్తడి ఇవాళ కిలోకు రూ.300 మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 75 వేల 700 మార్క్ వద్ద కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని హస్తినాలో చూసుకున్నట్లయితే కిలో వెండి రేటు రూ.300 తగ్గి ప్రస్తుతం రూ.73 వేల వద్ద ట్రేడవుతోంది. దిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో వెండి ధర ఎక్కువ, బంగారం ధర తక్కువగా ఉంటుంది. అందుకు స్థానిక పన్నులు కారణమవుతాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement