Monday, November 25, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాములకు తాజాగా రూ.500 మేర పడిపోయింది. దీంతో ఇప్పుడు రూ. 55 వేల మార్కు దిగొచ్చి రూ.54,800 మార్కుకు చేరింది. 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే రూ.60 వేల మార్కు నుంచి దిగొచ్చింది. ప్రస్తుతం రూ. 540 పడిపోయి రూ.59 వేల 780 వద్ద కొనసాగుతోంది. దిల్లీ మార్కెట్లోనూ ఇదే విధంగా గోల్డ్ రేటు పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.500 తగ్గి రూ.54,950 వద్ద ఉండగా .. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.540 పడిపోయి రూ.59,930 వద్ద ఉంది. ఇటీవల 10 రోజుల వ్యవధిలోనే సుమారు రూ. 7 వేల పెరిగిన సిల్వర్ రేటు తాజాగా దిల్లీలో తగ్గుముఖం పట్టింది. రూ.100 తగ్గి ప్రస్తుతం కిలోకు రూ.72 వేల మార్కు వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో మాత్రం రేట్లు అలాగే పెరుగుతూనే ఉన్నాయి. రూ. 200 పెరిగి కేజీ సిల్వర్ రేటు రూ.74,600 మార్కు వద్ద ఉంది. మరోవైపు అంతర్జాతీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1981.05 డాలర్ల వద్ద ఉండగా.. స్పాట్ సిల్వర్ 22.54 డాలర్ల వద్ద ఉంది. డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ రూ.82.56 వద్ద ట్రేడవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement