నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 పెరిగి ప్రస్తుతం రూ.53 వేల 100 మార్కును తాకింది. ఇటీవలి కాలంలో 53 వేల రూపాయలకు గోల్డ్ చేరడం ఇదే తొలిసారి. దీంతో కొనేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల పసిడి రేటు తులానికి రూ.440 పెరిగి ప్రస్తుతం రూ.57,930 వద్ద ట్రేడవుతోంది. ఇక దిల్లీలో కూడా బంగారం ధర పెరిగింది. అక్కడ 22 క్యారెట్ల గోల్డ్ తులానికి రూ.400 పెరగ్గా ప్రస్తుతం రూ.53,250 వద్ద కొనసాగుతోంది. ఇదే క్రమంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.430 పెరిగి రూ.58,080 వద్ద ట్రేడవుతోంది.
హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో గోల్డ్ రేటు కాస్త ఎక్కువగానే ఉంటుంది. స్థానికంగా ఉండే పన్నులు, పరిస్థితులు దీనికి ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తారు.బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో వెండి రేట్లు కూడా హైదరాబాద్, దిల్లీలో ఎలా ఉన్నాయో చూద్దాం. దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి రేటు రూ.100 పెరిగి ప్రస్తుతం రూ. 72,600 మార్కు వద్ద కొనసాగుతోంది. ఇక ఇదే హైదరాబాద్‌లో మాత్రం రూ.1000 మేర పెరగడం గమనార్హం. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.75 వేల మార్కు వద్ద ట్రేడవుతోంది. దిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో గోల్డ్ రేటు తక్కువగా ఉన్నప్పటికీ.. సిల్వర్ రేటు మాత్రం ఎక్కువగా ఉంటుంది.