Saturday, November 23, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్, దిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో రేట్లు అమాంతం పెరుగుతున్నాయి. కొవిడ్ భయాలు, ఆర్థిక మాంద్యం సంకేతాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ధరలు మరింత పెరిగే అవకాశాలను కల్పిస్తున్నాయి. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. బంగారం, వెండి ధరలు కొద్దిరోజులుగా పెరుగుకుంటూ పోతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు ప్రస్తుతం రూ.200 పెరిగి రూ.50,150 వద్ద ఉంది. నవంబర్ నెల కనిష్టం రూ.46,100 వద్ద 4వ తేదీన నమోదైంది. అంటే ఈ మధ్య గోల్డ్ రేటు ఏకంగా రూ.4 వేలు పెరిగిందన్నమాట.

24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌లో రూ.230 పెరిగి రూ.54,710కి చేరింది. దిల్లీలో 22 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రూ.200 పెరిగి రూ.50,300 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ దిల్లీలో తులానికి రూ.54,860 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్‌లో కేజీకి రూ.400 పెరిగి రూ.74,600కు చేరింది. దిల్లీలో కిలో వెండి రేటు రూ.72,300 వద్ద స్థిరంగా ఉంది. దిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో వెండి రేటు కాస్త ఎక్కువగా, బంగారం రేటు తక్కువగా ఉంటుంది. స్థానిక పన్నులు ఇందుకు కారణం. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement