నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ. 47,850 వద్ద ఉంది. అంతకుముందు రోజు కూడా ధర ఇంతే. అయితే.. సెప్టెంబర్ 1న ఈ రేటు రూ. 46,650 వద్ద ఉండేది. సెప్టెంబర్ 16న రూ. 45,800 వద్ద ధర కనిపించింది. ఇక 24 క్యారెట్లకు చెందిన పసిడి ధరలోనూ ఎలాంటి మార్పు లేదు. తులం బంగారం ధర రూ. 52,200 పలుకుతోంది. అక్టోబర్ ప్రారంభంలో ఈ రేటు 50 వేల రూపాయల లెవెల్స్‌లో ఉంది. సిల్వర్ ధరలోనూ ఇవాళ ఎలాంటి హెచ్చుతగ్గులు లేవు. అక్టోబర్ 5న రూ. 67 వేలు ఉన్న కేజీ వెండి ధర.. ఇప్పుడు రూ. 66 వేలకు చేరడం విశేషం. అక్టోబర్ 6, 8 తేదీల్లో రూ. 500 చొప్పున తగ్గుకుంటూ వచ్చాయి. అక్టోబర్ 4న మాత్రం రికార్డు స్థాయిలో ఒకే రోజు ఏకంగా రూ.4200 మేర ధర పెరిగింది. అక్టోబర్ 1న రేటు రూ. 62 వేలుగా ఉండగా.. ఇప్పుడు రూ. 66 వేల వద్ద ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement