Saturday, November 23, 2024

చుక్క‌లు చూపిస్తోన్న బంగారం.. వెండి ధ‌ర‌లు

నేడు బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. బంగారం, వెండి రేట్లు మళ్లీ చుక్కలు చూపిస్తున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా రికార్డు స్థాయిలో పెరిగాయి. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ప్రస్తుతం ఔన్సుకు 1820 డాలర్లకు ఎగబాకింది. ఇది కొద్ద రోజుల కిందటి వరకు 1750 డాలర్ల వద్ద ఉండేది. ఇప్పుడు మాత్రం అందనంత ఎత్తుకు చేరి కూర్చుంది. స్పాట్ సిల్వర్ రేటు మాత్రం దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఔన్సుకు స్పాట్ సిల్వర్ ధర 24 డాలర్లపైన చేరింది. ఇది నాలుగైదు రోజుల కిందట 1700 డాలర్ల దిగువన ఉండటం గమనార్హం.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పతనం అవుతుంది. ప్రస్తుతం రూపాయి విలువ రూ.82.80 వద్ద కొనసాగుతోంది. ఇటీవల రూ.83 లెవెల్స్‌కు కూడా చేరింది. దేశీయంగా చూస్తే గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. ఏకంగా 9 నెలల గరిష్టానికి పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.500 పెరిగి రూ.50,100కు చేరింది. దిల్లీలో ఇది రూ.50,250 వద్ద ఉంది. నవంబర్ కనిష్టం నుంచి ఏకంగా రూ.4 వేలకుపైగా పెరిగింది. 24 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు హైదరాబాద్‌లో రూ.540 పెరిగి మొత్తంగా రూ.54 వేల 650 పైకి చేరింది. దిల్లీలో ఈ రేటు రూ.54,820 వద్ద ఉంది. ఇది కూడా 9 నెలల గరిష్టం కావడం ఆందోళన కలిగిస్తోంది. త్వరలో 55 వేల మార్కు కూడా దాటే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement