నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం 22 క్యారెట్లకు రేటు క్రితం సెషన్‌తో పోలిస్తే స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రేటు రూ.55 వేల 950 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధరలో సైతం ఎలాంటి మార్పు లేదు. ఇవాళ తులానికి రూ.61 వేల 40 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 55 వేల 100 పలుకుతుండగా.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు రూ.61,190 మార్క్ వద్ద ఉంది. వెండి రేటు సైతం ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది. అయినప్పటికీ రికార్డు స్థాయిల్లోనే ఉంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర ఇవాళ రూ.80 వేల 200 మార్క్ వద్ద ఉంది. క్రితం సెషన్‌లో కిలోపై రూ.500 తగ్గిన వెండి ఇవాళ మాత్రం స్థిరంగానే ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు రూ.76 వేల 500 పలుకుతోంది. ఢిల్లీ, హైదరాబాద్ మధ్య ధరల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకు స్థానికంగా ఉండే ట్యాక్సులు, ఇతర అంశాలు కారణమవుతాయి.గ్లోబల్ బులియన్ మార్కెట్లో చూసినట్లయితే బంగారం ధర కాస్త దిగివచ్చింది. ఇటీవలి కాలంలో స్పాట్ గోల్డ్ రేటు 2 వేల డాలర్ల వరకు చేరిన విషయం తెలిసిందే. అయితే డాలర్ పుంజుకుంటుండడంతో ధరలు పడిపోతున్నాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1987 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24.89 డాలర్ల వద్ద కొనసాగుతోంది.