Monday, November 25, 2024

నేడు బంగారం..వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100 మేర పతనమై.. రూ.46 వేల 900కు పడిపోయింది. ముందురోజు ఇది రూ.47 వేల మార్కు వద్ద ఉంది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర హైదరాబాద్‌లో రూ.120 మేర పడిపోయింది. దీంతో రేటు రూ.51,160 వద్ద ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి 47 వేల 50 రూపాయల వద్ద ట్రేడవుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర దేశ రాజధానిలో రూ.110 తగ్గి రూ.51,330 వద్ద ఉంది. ఇక విజయవాడ మార్కెట్‌లో దాదాపు హైదరాబాద్‌ రేట్లే ఉన్నాయి. ప్రాంతాలను బట్టి, పన్నులను బట్టి బంగారం రేట్లలో హెచ్చుతగ్గులు ఉంటాయి.ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతకుముందు రెండు రోజుల్లో రూ.2300 మేర పెరిగిన బంగారం ధర ఇవాళ ఏం మారలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66 వేల 300 వద్ద ఉంది. దిల్లీలో మాత్రం కిలో వెండి రూ. 100 మేర పతనమైంది. ప్రస్తుతం అక్కడ వెండి రేటు కిలోకు రూ. 60 వేల 400 వద్ద ఉంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే దిల్లీలో వెండి ధరలు చాలా తక్కువగా ఉండటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement