Friday, November 22, 2024

త‌గ్గిన బంగారం..వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు కాస్త ఊర‌ట‌నిచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌లో ఆగస్ట్ 24న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 700 పడిపోయింది. దీంతో పసిడి రేటు రూ. 51,230కు క్షీణించింది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేటు కూడా పది గ్రాములకు రూ. 600 పడిపోయింది. దీంతో ఈ పసిడి రేటు రూ. 47 వేలకు తగ్గింది. బంగారం ధర నిన్న కూడా రూ. 220 మేర దిగి వచ్చింది. ఇకపోతే వెండి ధర విషయానికి వస్తే.. రూ. 400 పడిపోయింది.

దీంతో కేజీ వెండి రేటు రూ. 60,700కు క్షీణించింది. సిల్వర్ రేటు నిన్న రూ. 200 మేర తగ్గింది. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి రేటు నేల చూపులు చూస్తోంది. ఈ ప్రభావమేదేశీ మార్కెట్‌లో కూడా బంగారం ధరలపై పడిందని నిపుణులు పేర్కొంటున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి రేటు 0.08 శాతం క్షీణించింది. ఔన్స్‌కు 1759 డాలర్లకు తగ్గింది. అలాగే వెండి రేటు కూడా ఇదే దారిలో ఉంది. 0.24 శాతం క్షీణించింది. బ్యారెల్‌కు వెండి రేటు 18.9 డాలర్లకు తగ్గింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement