Saturday, November 23, 2024

స్వ‌ల్పంగా పెరిగిన బంగారం-తగ్గిన వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. మన బులియన్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 100 మేర పెరిగి రూ.46,750కి చేరింది. క్రితం రోజు ఇది రూ.46,650 వద్ద ఉంది. మరోవైపు 24 క్యారెట్లకు చెందిన బంగారం రూ.110 చొప్పున ఎగిసి.. రూ.51 వేలకు పెరిగింది. అయితే అంతకుముందు 3 రోజుల్లో కలిపి బంగారం ధర ఏకంగా 1300 రూపాయలకుపైగా పతనమైంది. అంతకుముందు 3 రోజులు స్థిరంగా, అంతకుముందు 4 రోజులు ధరలో పెరుగుదల కనిపించింది. బంగారం విషయానికి వస్తే 24 క్యారెట్లను స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తారు. సాధారణంగా 22 క్యారెట్ల బంగారాన్నే ఆభరణాల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. ఇప్పటికే రేట్లు తగ్గుతున్నాయి.. మళ్లీ తగ్గే అవకాశం ఉన్నందున దీపావళికి ముందు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం.
మరోవైపు సిల్వర్ రేటు పడిపోతూనే ఉంది. కేజీకి రూ.500 మేర పడిపోవడం విశేషం. దీంతో హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.62,500కు చేరింది. దీంతో సిల్వర్ రేటు గత 8 రోజులుగా పతనమవుతూనే ఉంది. ఈ సెషన్లలో ఏకంగా రూ.4500 పడిపోయింది. ప్రాంతాలను బట్టి ధరల్లో కాస్త హెచ్చుతగ్గులు ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement