Friday, November 22, 2024

త‌గ్గిన బంగారం ధ‌ర‌-భారీగా ప‌త‌న‌మైన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు కాస్త త‌గ్గాయి. బంగారంతో పాటు వెండి కూడా భారీగా పతనమైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 24 క్యారెట్ల ప్యూరిటీ గోల్డ్ ధర రూ.573 మేర తగ్గడంతో.. ఈ రేటు రూ.52,012గా నమోదైంది. డిమాండ్ తక్కువగా ఉండటంతో ధరలు దిగొస్తున్నాయి. బంగారంతో పాటు సిల్వర్ ధర కూడా పతనమైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ ధర రూ.1,324 పతనమై కేజీ రూ.57,952గా నమోదైంది. అంతకుముందు సిల్వర్ ధర రూ.58,501 వద్ద ట్రేడైంది. ట్రేడింగ్ ప్రారంభంలోనే ధరలు పతనమై.. ఆ రేట్లు మరింత తగ్గాయి. డాలర్ బలపడటం, మళ్లీ ఫెడరల్ రిజర్వు రేట్ల పెంపు భయాలు నెలకొనడంతో బంగారం రేట్లు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ అంటే 28.35 గ్రాముల ధర 1,775 డాలర్లుగా(రూ.1,40,821గా) నమోదైంది. అలాగే సిల్వర్ రేటు ఔన్స్ 20.13 డాలర్ల వద్ద ఫ్లాట్‌గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement