Saturday, November 23, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-పెరిగిన వెండి

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు కాస్త పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో ఆగస్ట్ 3న బంగారం ధర రూ. 270 మేర పైకి చేరింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి ఈ పెంపు వర్తిస్తుంది. దీంతో ఈ పసిడి రేటు రూ. 51,650కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. ఈ పసిడి రేటు రూ. 250 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల పసిడి రేటు రూ. 47,350కు ఎగసింది. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. సిల్వర్ రేటు రూ. 300 మేర పైకి చేరింది. దీంతో ఈరోజు కేజీ వెండి ధర రూ. 63,600కు చేరింది. నిన్న సిల్వర్ ధర రూ. 400 మేర పడిపోయిన విషయం తెలిసిందే.

విజయవాడలో సిల్వర్ రేటు రూ. 300 పెరుగుదలతో రూ. 63,600కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,650కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,350కు చేరింది. పది గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. విశాఖపట్నంలో బంగారం ధరను గమనిస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,650కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,350కు ఎగసింది. పది గ్రాములకు ఈ రేట్లు వర్తిస్తాయి. అలాగే సిల్వర్ ధర కేజీకి రూ. 300 పెరిగింది. రూ. 63,600కు చేరింది. పైన పేర్కొన్న బంగారం ధరలకు జీఎస్‌టీ, ఇతర చార్జీలు అదనం.

Advertisement

తాజా వార్తలు

Advertisement