Saturday, November 23, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-త‌గ్గిన వెండి ధ‌ర‌

నేటి బంగారం ధ‌ర‌లు కాస్త త‌గ్గాయి. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి రేటు పడిపోయింది. 0.46 శాతం క్షీణించింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1692 డాలర్లకు దిగి వచ్చింది. బంగారం రేటుకు 1700 డాలర్ల వద్ద మద్దతు లభిస్తోంది. అయితే పసిడి రేటు ఈ స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. దీంతో బంగారం ధరలు మరింత తగ్గొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే వెండి రేటు విషయానికి వస్తే.. సిల్వర్ రేటు ఔన్స్‌కు 0.44 శాతం పడిపోయింది.

18.58 డాలర్ల వద్ద కదలాడుతోంది.దేశీ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో పసిడి రేటు జూలై 21న రూ. 110 పెరిగింది. దీంతో బంగారం ధర రూ. 50,620కు చేరింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి ఈ రేటు వర్తిస్తుంది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేటు అయితే రూ. 100 పెరిగింది. దీంతో తులం రేటు రూ. 46,400కు చేరింది. బంగారం ధరలు పెరగడం ఇది వరుసగా రెండో రోజు. నిన్న కూడా పసిడి రేటు పైపైకి చేరింది. రూ. 120 పెరిగింది. ఇక వెండి రేటు చూస్తే.. రూ. 300 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ. 61 వేలకు ఎగసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement