Monday, November 18, 2024

పెరిగిన బంగారం ధ‌ర‌లు

నేటి బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయో చూద్దాం.. మే 7న హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ. 47,850కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు ( కూడా రూ.110 మేర పైకి కదిలింది. దీంతో ఈ బంగారం ధర రూ. 52,200కు ఎగసింది. కాగా పసిడి రేటు నిన్న రూ. 380 మేర పడిపోయిన విషయం తెలిసిందే. తగ్గుదల కేవలం ఒక్క రోజు ముచ్చటనే మిగిలింది. అదే సిల్వర్ రేటు విషయానికి వస్తే.. కేజీకి రూ. 1000 మేర పెరిగింది. రూ. 68,500కు చేరింది. కాగా నిన్న వెండి రేటు స్థిరంగా కొనసాగిన విషయం తెలిసిందే. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి రేటు వెలవెలబోయింది. బంగారం ధర 0.2 శాతం క్షీణించింది. ఔన్స్‌కు 1840 డాలర్లకు దిగి వచ్చింది. మరోవైపు వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. సిల్వర్ రేటు 0.34 శాతం క్షీణించింది. ఔన్స్‌కు 22.01 డాలర్లకు తగ్గింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గినా కూడా దేశీ మార్కెట్లో పసిడి రేటు పైపైకి కదలడం గమనార్హం. ఇకపోతే బంగారం కొనుగోలు చేయాలని భావించే వారు ఒక విషయం తెలుసుకోవాలి. పసిడిలో ఇన్వె్స్ట్ చేయాలని యోచిస్తే.. గోల్డ్ ఈటీఎఫ్‌లు, సావరిన్ గోల్డ్ బాండ్లు మంచి ఆప్షన్ అని జెరోదా ఫౌండర్ నితిన్ కామత్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement