నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల గోల్డ్ రేటు 22 క్యారెట్స్‌కు ఒక్కరోజే రూ. 950 పెరిగింది. దీంతో ఇప్పుడు షాకింగ్‌కు గురిచేస్తూ రేటు రూ.56,250 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1030 మేర పుంజుకొని.. రూ.61,360 వద్ద ట్రేడవుతోంది. దిల్లీ మార్కెట్లో గోల్డ్ ధరలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. దేశరాజధానిలో 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాములకు రూ.950 పెరగ్గా.. రూ.56,400 మార్కు వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.1030 పెరిగి ప్రస్తుతం రూ.61,510 వద్ద కొనసాగుతోంది.ఇక వెండి విషయానికి వస్తే ఒక్కరోజే రికార్డు స్థాయిలో పెరగడం గమనార్హం.
ప్రస్తుతం దిల్లీలో కిలో వెండి ఒక్కరోజులోనే రూ.2490 మేర ఎగబాకగా.. రూ.77,090 మార్కును తాకింది. ఇక హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ తాజాగా ఒక్కరోజే రూ.2900 పెరగ్గా.. రూ.80,700 మార్కు వద్ద ఉంది. సాధారణంగా హైదరాబాద్, దిల్లీ మార్కెట్లలో ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. స్థానికంగా ఉండే పన్నులను బట్టి ఈ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. దిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువ ఉంటే.. హైదరాబాద్‌లో సిల్వర్ రేటు ఎక్కువగా ఉంటుంది.తాజాగా గోల్డ్ రేట్లు ఇంతలా పెరగడానికి కారణాలను ఓసారి పరిశీలిద్దాం. మొదటగా చెప్పుకోవాల్సింది డాలర్ విలువ పడిపోవడం. ఎప్పుడైనా డాలర్ పెరిగినప్పుడు అప్పుడు యూఎస్ బాండ్ ఈల్డ్స్ గిరాకీ పెరిగి.. బంగారం తక్కువ సురక్షితమైనదిగా అవుతుంది. అప్పుడు రేటు పడుతుంది. అయితే ఇప్పుడు అమెరికా ఆర్థిక డేటా బలహీనంగా నమోదైన తరుణంలో డాలర్ పడిపోతోంది. మరోవైపు క్రూడాయిల్ రేట్లు పెరిగిపోతున్నాయి. ఆర్థిక అనిశ్చితి కూడా కారణం.