Friday, November 22, 2024

కాస్త త‌గ్గిన బంగారం ధ‌ర‌లు

నేడు బంగారం ధ‌ర‌లు కాస్త త‌గ్గాయి. కాగా హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,380 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 850 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ. 300 తగ్గి రూ. 74,900 గా నమోదు అయింది. పసిడి రేటు ఔన్స్‌కు 0.51 శాతం, వెండి రేటు ఔన్స్‌కు 0.82 శాతం మేర తగ్గాయి. దీంతో గోల్డ్ రేటు 1948 డాలర్లకు, వెండి రేటు 25.17 డాలర్లకు తగ్గాయి. అదే దేశీ మార్కెట్‌లో అయితే బంగారం వెండి ధరలు చెరోదారిలో నడిచాయి. పసిడి రేటు స్థిరంగానే కొనసాగుతోంది. వెండి రేటు మాత్రం తగ్గింది. ఏప్రిల్ 20న బంగారం ధర తులానికి రూ. 49,850 వద్ద ఉంది. ఇది ఆర్నమెంటల్ గోల్డ్‌కు సంబంధించింది. అలాగే 999 స్వచ్ఛత గత బంగారం ధర 10 గ్రాములకు రూ. 54,380 వద్ద ఉంది. అంటే నిన్నటి రేట్లే ఈ రోజు కూడా కొనసాగాయి. అలాగే వెండి రేటు మాత్రం రూ. 300 దిగి వచ్చింది. దీంతో సిల్వర్ రేటు కేజీకి రూ. 74,900కు క్షీణించింది. అయినా కూడా వెండి రేటు ఇంకా ఎక్కువ స్థాయిల్లోనే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement