Tuesday, November 19, 2024

నేటి బంగారం ధ‌ర‌లు – దూసుకుపోతోన్న వెండి

బంగారం ధ‌ర‌లు నేడు స్థిరంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.49,550 పలుకుతోంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.54,060గా ఉంది. అయితే హైదరాబాద్ మార్కెట్లో వెండి రేటు మాత్రం నేడు నేలచూపులు చూసింది. కేజీ వెండి ధర ఆదివారం రూ.200 తగ్గి రూ.74,200గా నమోదైంది. హైదరాబాద్‌తో పాటు పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రంలోని విజయవాడలో కూడా వెండి ధరలు ఈ విధంగానే నమోదయ్యాయి. రూ.200 తగ్గిన వెండి ధర విజయవాడలో రూ.74,200గా రికార్డయింది. ఇకపోతే బంగారం ధరలలో విజయవాడ మార్కెట్లో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర కూడా అక్కడ రూ.49,550గానే ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.54,060గా రికార్డయింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్తబ్దుగా ఉన్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.49,550గా, 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.54,060గా రికార్డయ్యాయి. కేజీ సిల్వర్ రేటు మాత్రం ఢిల్లీలో భారీగా దిగొచ్చింది. ఈ రేటు కేజీకి రూ.900 తగ్గి రూ.69,100గా రికార్డయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement