Saturday, November 23, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-స్థిరంగా వెండి

నేటి బంగారం ధ‌ర‌లు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.46,400గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.50,620గా రికార్డయింది. పసిడి రేట్లు తగ్గిన ఈ సమయంలో వెండి మాత్రం స్థిరంగా ఉంది. సిల్వర్ రేట్లు హైదరాబాద్‌లో స్థిరంగా రూ.58 వేల వద్ద పలుకుతున్నాయి. బలమైన డాలర్‌తో బంగారం ధరలు ఒత్తిడికి గురవుతున్నాయి. మూడు వారాల్లోనే బంగారం ధరలు రూ.2,700 మేర తగ్గిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు 350 డాలర్ల మేర దిగొచ్చి, ఆరు వారాల కనిష్టాలకు పడిపోయాయి. వడ్డీ రేట్లను మరింత కఠినతరం చేస్తామంటూ ఫెడ్ సంకేతాలు ఇవ్వడంతో.. బంగారం భారీగా పడుతోంది. విజయవాడ మార్కెట్లో కూడా బంగారం ధరలు డౌన్‌ట్రెండ్‌లోనే ఉన్నాయి. విజయవాడలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.46,400గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.50,620గా ఉంది. విజయవాడలో సిల్వర్ రేటు స్థిరంగా రూ.58 వేల వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement