Tuesday, November 19, 2024

త‌గ్గుతోన్న బంగారం.. పెరిగిన వెండి ధ‌ర‌

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి..హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు భారీగా దిగొచ్చింది. ఒక్కరోజే రూ.550 మేర తగ్గి.. తులం రూ.49,700కు చేరింది. ఇక 24 క్యారెట్ల తులం బంగారం ధర హైదరాబాద్‌లో రూ.600 పడిపోయింది. దీంతో రూ.54,220కి చేరింది. ఇక దేశరాజధాని దిల్లీలో కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఇక్కడ తులం పసిడి ధర రూ.550 పతనమై రూ. 49,850 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.600 తగ్గి 54 వేల 380 రూపాయలకు పడిపోయింది.

ఇటీవల యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచినప్పటికీ బంగారం, వెండి ధరల్లో పెద్ద మార్పు కనిపించలేదు. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే గోల్డ్, సిల్వర్ వంటి విలువైన లోహాల ధరలు పడిపోతుంటాయి. కానీ ఇటీవల మాత్రం అలా జరగలేదు. 2 రోజులు మాత్రం తగ్గి.. తర్వాత వరుసగా పెరుగుకుంటూ పోయాయి. దీంతో ఇదే సమయంలో అంతర్జాతీయంగా రికార్డు స్థాయికి, దేశీయంగా కూడా 9 నెలల గరిష్టానికి బంగారం, వెండి ధరలు పెరగడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement