Friday, September 20, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-త‌గ్గిన వెండి

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజే రూ.700మేర తగ్గడం విశేషం. అంతకుముందు రోజు ధర రూ.47,600 వద్ద ఉండగా.. ఇవాళ రూ.46,900కు పడిపోయింది. ఇదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.770 తగ్గి.. రూ.51,160కి పతనమైంది. దీంతో రెండు రోజుల్లో బంగారం ధర రూ.1000 తగ్గింది. అంతకుముందు 3 రోజులు మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి రేట్లు కూడా కేజీకి ఏకంగా రూ.800 తగ్గి ప్రస్తుతం రూ.64 వేల 800 నుంచి రూ.64 వేలకు పడిపోయింది. అక్టోబర్ 11న కిలో సిల్వర్ రేటు రూ.1200 మేర తగ్గింది. దీంతో రెండు రోజుల్లో గోల్డ్ రూ.1000, సిల్వర్ రూ.2000 తగ్గినట్లయింది. దేశ రాజధాని దిల్లీలోనూ 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.700 మేర తగ్గింది. దీంతో ముందు రోజు రూ.47,750రగా ఉన్న గోల్డ్ రేటు రూ.47,050కి పతనమైంది. ఇదే 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే రూ.770 తగ్గి 10 గ్రాముల ధర రూ. 51,330కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement