నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి.హైదరాబాద్‌లో బంగారం 22 క్యారెట్ల ధర ఇవాళ 10 గ్రాములకు రూ.300 తగ్గి రూ.55 వేల 750 వద్దకు దిగి వచ్చింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి రేటు ఇవాళ తులానికి రూ.330 తగ్గింది. ప్రస్తుతం రూ.60 వేల 820 పలుకుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ.300 తగ్గి ప్రస్తుతం రూ.55 వేల 900 మార్క్ వద్ద ట్రేడవుతోంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు తులానికి రూ.310 దిగివచ్చి ప్రస్తుతం రూ.60 వేల 970 వద్ద ఉంది.ఇక వెండి సైతం బంగారం దారిలోనే నడుస్తూ ఇవాళ భారీగా దిగివచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.900 తగ్గి రూ.80 వేల 400ల మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇటీవలి కాలంలో వెండి రేటు భారీగా పరుగులు పెట్టిన విషయం తెలిసిందే. ఇవాళ కాస్త దిగిరావడం ఊరట కలిగించే విషయంగానే చెప్పాలి. ఇక దేశ రాజధాని హస్తినాలో చూస్తే వెండి రేటు కిలోకు రూ.700 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ఢిల్లీలో రూ.76 వేల 900 పలుకుతోంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో బంగారం రేటు కాస్త తక్కువ, వెండి రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement