Saturday, November 23, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేడు బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన బంగారం ధరలో ఏ మార్పూ లేదు. తులానికి రూ.52,750 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్లకు చెందిన గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 57,550 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల వరుసగా 2 రోజుల వ్యవధిలో రూ.1200 మేర పడిపోయిన గోల్డ్ రేటు తర్వాత మళ్లీ రూ.350 వరకు పెరిగింది. మరోవైపు దిల్లీలో 22 క్యారెట్లకు చెందిన బంగారం ధర తులానికి రూ.52,900 వద్ద ఉంది. ఇదే 24 క్యారెట్లకు చెందిన గోల్డ్ 10 గ్రాములకు రూ.57,700 వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో బంగారం ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. వెండి రేట్లు మాత్రం దిల్లీలోనే తక్కువగా ఉంటాయి. దిల్లీలో కిలో వెండి రేటు రూ.100 మేర పెరిగి రూ.71,400 మార్కుకు చేరింది. ఇక హైదరాబాద్‌లో సిల్వర్ ధరలో మాత్రం వరుసగా 2 రోజుల్లో ఎలాంటి మార్పూ కనిపించట్లేదు. ప్రస్తుతం రూ.74 వేల మార్కు వద్ద ఉంది. స్థానికంగా ఉండే పన్నులను బట్టి బంగారం, వెండి రేట్లలో హెచ్చుతగ్గులు ఉంటాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం కాస్త అదుపులోకి వస్తున్న నేపథ్యంలో అక్కడ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు విషయంలో కాస్త నెమ్మదించింది. ఈసారి స్వల్పంగా 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును పెంచింది. అంతకుముందు వరుసగా 50, 75 బేసిస్ పాయింట్ల మేర పెంచడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement