బంగారం ధరలు రోజు రోజుకి మారుతుంటాయి. వెండి ధరలు కూడా అంతే..నేటి బంగారం..వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1865 డాలర్ల వద్ద కొనసాగుతోంది. స్పాట్ సిల్వర్ 22.36 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 2 రోజుల కిందట ఇవి వరుసగా 2000 డాలర్లకు సమీపంలో, 24 డాలర్లపైన ఉండటం గమనార్హం. ఈ రెండు రోజుల్లోనే భారీగా తగ్గింది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణిస్తోంది. ప్రస్తుతం రూ.82.488 వద్ద ఉంది.
ఇక దేశీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు రికార్డు స్థాయిలో పడిపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన గోల్డ్ రేటు తులానికి రూ.700 మేర పడిపోయి.. రూ.52,400 మార్కుకు చేరింది.
ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.770 పతనమై.. 10 గ్రాములకు రూ.57,160 మార్కు వద్ద ఉంది. ఇక దిల్లీలో కూడా గోల్డ్ రేటు క్షీణించింది. అక్కడ 22 క్యారెట్ల తులం గోల్డ్ రూ.700 తగ్గి రూ.52,550 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ.770 పడిపోయి రూ.57,310 వద్ద కొనసాగుతోంది. బంగారంతో పోలిస్తే వెండి ధర మరింత భారీగా పతనమైంది. దిల్లీలో కిలో వెండి ఒక్కరోజే ఏకంగా రూ.2600 క్షీణించి.. ప్రస్తుతం రూ.71,200 వద్ద ఉంది. 2 రోజుల వ్యవధిలో ఇక్కడ సిల్వర్ రేటు ఏకంగా రూ.3500 తగ్గింది. ఇక హైదరాబాద్‌లో మాత్రం మరోసారి రూ.1800 పడిపోయి రూ.74,200 కు చేరింది. ఇక్కడ కూడా 2 రోజుల వ్యవధిలో రూ.3600 క్షీణించడం గమనార్హం. ఫిబ్రవరి 2న ఇక్కడ కిలో సిల్వర్ రేటు అత్యధికంగా రూ.77,800కు చేరిన విషయం తెలిసిందే.