Wednesday, November 20, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. హైదరాబాద్‌లో బంగారం విషయానికి వస్తే తాజాగా మరో 100 రూపాయలు పెరగ్గా.. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ తులానికి రూ.52,350 వద్ద ఉంది. ఇది డిసెంబర్ కనిష్టంతో పోలిస్తే ఏకంగా రూ.3600 పెరగడం గమనార్హం. డిసెంబర్ నెలలో అత్యల్పంగా ఒకటో తేదీన బంగారం ధర రూ.48,750 వద్ద ఉండటం గమనార్హం. దీంతో ఈ 50 రోజుల్లోనే భారీ ఛేంజ్ కనిపిస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇక 24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే హైదరాబాద్‌లో ప్రస్తుతం రూ.50 మేర పెరిగి 10 గ్రాములకు రూ.57,110 వద్ద ఉంది. ఢిల్లీలో కూడా బంగారం ధర మళ్లీ పెరిగింది. తాజాగా రూ.100 మేర పెరగ్గా.. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు ప్రస్తుతం రూ.52,500 వద్ద కొనసాగుతోంది.

ఇక 24 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.60 మేర ఎగబాకి.. రూ.57,270 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌తో పోల్చి చూస్తే దిల్లీలో గోల్డ్ రేటు కాస్త ఎక్కువగానే ఉంటుంది. స్థానికంగా ఉండే పన్నులు, అక్కడి ఇతర పరిస్థితులు ఇందుకు కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. బంగారం ధరలు పెరిగినప్పటికీ మరోవైపు వెండి రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. దిల్లీలో కిలో వెండి ప్రస్తుతం రూ.72,300 వద్ద ఉంది. రెండు రోజులుగా ఈ రేట్లలో ఎలాంటి మార్పూ లేదు. అంతకుముందు వరుసగా రెండు రోజులు పెరిగాయి. ఇక హైదరాబాద్‌లో సిల్వర్ రేటు మళ్లీ పుంజుకుంది. ఒక్కరోజే రూ.400 పెరగ్గా.. ప్రస్తుతం కిలోకు రూ.74,700కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement